కొత్త పార్లమెంట్ బోర్డును ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు మరో తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బోర్డును ప్రకటించారు. నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీనడ్డా, యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జారియా, బీఎల్ సంతోష్‌ను సభ్యులు నియమించింది. పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌కు ఉద్వాసన పలికింది. అలాగే బీజేపీ 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.













