బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలి
రూ.2,000 నోట్లను బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ రూ.2.000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ పెద్ద నోట్లు ఉన్న వారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని సూచించారు. దేశంలోని ఏటీఎంలలో రూ.2 వేల నోట్లనీ ఖాళీ అయ్యియని సుశీల్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ నోట్లను రద్తు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని తెలిపారు. కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ మూడేళ్ల కిందటే నిలిపివేసిందని తెలిపారు.













