ప్రధాని మోదీ హత్యకు… ఉగ్రవాదుల కుట్ర?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలో మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్ని ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2047 నాటికి భారత్‌ను ఇస్తామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అంతేగాక జులై 12వ మోదీ బిహార్ పర్యటన సందర్భంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కుట్ర జరిగినట్లు వెల్లడించారు.అరెస్ట్ చేసిన వారిని జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జల్లావుద్దీన్, అథర్ పర్వేజ్‌గా పోలీసులు పేర్కొన్నారు. వీరికి పీఎఫ్ఐతో లింకులు ఉన్నట్లు గుర్తించారు.
అనుమానిత ఉగ్రవాదులు ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందినట్లు పోలీసులు కనుగొన్నారు. జూలై 6, 7 తేదీల్లో మోదీ టార్గెట్‌గా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో పోలీసులు పలు నేరారోపణ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒక దాంట్లో 2047 వరకు ఇండియాను ఇస్లామిక్ ఇండియాగా మార్చాలి అని ఉంది. వీటతో పాటు 25 పీఎఫ్ఐ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.













