ట్రంప్ వైఫల్యమేనంటున్న బిజెపి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ విజయానికి ఆమడదూరంలో ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కరోనా కట్టడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విఫలమైతే ప్రధాని మోడీ విజయవంతం అయ్యారని జేపీ నడ్డా హాట్ కామెంట్స్ చేశారు. బీహార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కరోనా నియంత్రణలో ట్రంప్ సరిగా పనిచేయలేదని.. కానీ ప్రధాని మోడీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని 130 కోట్ల మంది భారతీయులను కాపాడారని జేపీ నడ్డా తెలిపారు. రెండుమూడేళ్లుగా ట్రంప్‌ను అవసరార్థం ప్రధాని మోడీ బాగా వాడేసుకున్నాడు. చైనా పాకిస్తాన్లతో ఫైట్ నేపథ్యంలో అమెరికా సాయం తీసుకున్నారు. ట్రంప్ ను మన దేశ పర్యటనకు తీసుకొచ్చి మోడీ బీజేపీ పెద్దలు చేసిన హల్ చల్ అంతా ఇంతాకాదు. ట్రంప్ ను ఉపయోగించుకొని దేశంలో బీజేపీ ఇమేజ్ ను భారీగా పెంచుకుంది. అసలు ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనతోనే దేశంలో కరోనా వేవ్ మొదలైందన్న విమర్శలు ఉన్నాయి. జెపి నడ్డా చెప్పినట్లు మోదీ కరోనా కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శ ఉంది. లాక్ డౌన్ విధించడం తప్పితే దేశ ప్రజలకు సాయం చేసింది.. కరోనా కట్టడి చేసింది ఇసుమంతైనా లేదన్నది కరోఠ వాస్తవమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.













