భారత్ బయోటెక్ ఎండీ రూ.కోటీ విరాళం
భారత్ బయోటెక్ ఎండి డా.కృష్ణ ఎల్ల ఉదారత చాటుకున్నారు. శబరిమల ఆలయంలో అన్నదాన కార్యక్రమం కోసం కోటీ రూపాయలను ఆయన విరాళంగా ప్రకటించారు. డా. కృష్ణ ఎల్ల సతీసమేతంగా శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లారు. దర్వనం అనంతరం ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు. దర్శనం అనంతరం శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కృష్ణకుమార్ వారియర్‌కు నగదును ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. విరాళం ఇచ్చినందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు అనంత గోపన్ కృష్ణ ఎల్లకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. శబరిమల అభివృద్ధికి, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా డా.కృష్ణ వెల్లడిరచారు. దర్శనం సమయంలో బోర్డు అధికారుల్లో చాలామంది కృష్ల ఎల్ల వెంటే ఉన్నారు.













