కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సేవలు, విజలెన్స్ శాఖలను మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సౌరభ్ భరద్వాజ ను తప్పించారు. ఆయా శాఖలను పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి అతిశీకి అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖను కూడా పంపించారు. మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లు జైలుకు వెళ్లడంతో వారికి కేటాయించిన శాఖలను సౌరభ్ భరద్వాజ, అతిశీకి కేటాయించారు. గత జూన్ నెలలోనే మంత్రి అతిశీకి అదనంగా రెవెన్యూ, ప్రణాళికలు, ఆర్థిక శాఖల బాధ్యతలను అప్పగించారు. కల్కీజీ నియోజవకర్గం నుంచి గెలిచిన ఆమెకు ప్రస్తుతం 14 శాఖలు కేటాయించారు. తాజా నిర్ణయంతో ఢిల్లీ ప్రభుత్వంలో అతి ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్న ఏకైక మహిళా మంత్రిగా అతిశీ నిలిచారు.













