వారికి దేశాన్ని పాలించే హక్కు లేదు : అమిత్ షా

దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అని అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ మైనార్టీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోందని, అంటే షరియా ప్రకారం దేశం నడవాలా అని ప్రశ్నించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారికి దేశాన్ని పాలించే హక్కు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్ అజెండాను అములు చేస్తోందని విమర్శించారు.