ఏఐ సరికొత్త ప్రయోగం.. దేశంలోనే తొలిసారిగా!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత పెను మార్పులకు నాంది పలుకుతోంది. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మహిళా యాంకర్ రంగంలోకి వచ్చేసింది. ఒడిశాలోని ఒక మీడియా సంస్థ లీసా పేరుతో తొలి ఏఐ యాంకర్‌ను పరిచయం చేసింది. ఈ యాంకర్ చాలా రకాల భాషలు మాట్లాడగలదని, ప్రస్తుతం ఇంగ్లిష్, ఒడియాలో వార్తలు చదువుతోందని వార్త సంస్థ ఎండీ లతిషా మంగత్ పాండా తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఒడియాలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ మేం సాధించాం. త్వరలోనే ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా తయారు చేస్తాం అని పేర్కొన్నారు.













