ప్రధాని మోదీ కార్గిల్ పర్యటనలో.. అరుదైన సంఘటన
సైన్యంలో విధులు నిర్వహిస్తోన్న ఓ మేజర్ కి అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో తన పాత జ్ఞాపకాన్ని పంచుకునే అవకాశం వచ్చింది. ఈ అరుదైన సంఘటనకు ప్రధాని మోదీ కార్గిల్ పర్యటన వేదికగా మారింది. గుజరాత్‌కు చెందిన అమిత్ బాలాచాడిలోని సైనిల్ స్కలులో చదువుకున్నారు. 2001 సంవత్సరంలో బాలాచాడి స్కూలులో జరిగిన ఓ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమిత్ ఓ షీల్డ్ అందుకున్నారు. తర్వాత చదువు పూర్తి చేసుకున్న అమిత్ భారత సైన్యంలో చేరి మేజర్ అయ్యారు. ప్రస్తుతం కార్గిల్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
దీపావళి సందర్భంగా మోదీ కార్గిల్ లో పర్యటిస్తారని తెలియడంతో అమిత్ సంతోషం పట్టలేకపోయారు. వెంటనే తన చిన్ననాటి ఫొటో ఫ్రేంను తెప్పించుకుని, ప్రధానికి ఆ ఫొటో చూపించే క్షణాల కోసం ఆతృతగా ఎదురుచూశారు. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి మోదీ ఏటా దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటూ వస్తున్నారు. అక్కడి సైనికులతో వేడుకలు జరుపుకుంటుండగా అమిత్ ఆయన దగ్గరికి వచ్చి చిన్నప్పటి సంగతిని గుర్తు చేశాడు. అప్పటి ఫొటోను మోదీకి చూపించారు. ఇద్దరూ అప్పటి విశేషాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అమిత్ షాతో పాటు ప్రధాని కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.













