గోవాలో విషాదం … 4 గంటల్లో 26 మంది
కరోనా ఒకవైపు ఉసురు తీసుకుంటే.. ఆక్సిజన్ కొరత మరోవైపు కరోనా బాధితులను పొట్టన పెట్టుకుంటోంది. గోవా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రి అయిన గోవా మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో నాలుగు గంటల వ్యవధిలోనే 26 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం 2 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ మరణాలు సంభించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు. అయితే ఘటనకు గల కారణాలపై స్పష్టత లేదన్నారు. అయితే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అక్కడి ప్రభుత్వం కారణాలను వెల్లడించడం లేదు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కచ్చితంగా చెప్పగలమని, ఎలా జరిగిందో తెలుసుకునేందుకు హైకోర్టు విచారణ కోరినట్లు రాణే తెలిపారు గోవా ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ కారణాలకు మెడికల్ ఆక్సిజన్, దాని సరఫరాలో ఆలస్యం కూడా కారణం కావచ్చునని పేర్కొన్నారు. అయితే గోవాలో ఆక్సిజన్ కొరత లేదని పేర్కొనడం కొసమెరుపు.













