రవికొండలరావు గారి హాస్య కథలు.. నవ్వులు పూయించే సరదా సంగతులు!
కనబడుటలేదు
రావి కొండలరావు
కేసులోని ఆఖరి సిగరెట్టు కూడా యాప్స్ లో చుమ్మనిపోయింది. మామూలు కుర్చీనే ఈజీచేర్ భావించుకుని, గోడకు కాళ్ళు సంధించి, వెనక్కుజేరబడి దీర్ఘాలోచనాపరుడై వున్న రాజుకు, ఐడియా మాత్రం ఇంకా కుదరలేదు.
ఆ ప్రకారంగానే కింద పుస్తకాల మధ్యలో శేషపాన్పు పైన పవళించిన విష్ణుమూర్తులవారి పోజ్‌లో ఎడమచేతిని నేలకు ఆనించి అరచేతిలో తలను పెట్టుకుని అంతకంటే ఆలోచనాపరుడైవున్న రామారావుకు కూడా ‘క్లూ’
దొరకలేదు.
ఈ మిత్రులొద్దరూ రెండుగంటల ముప్పయ్యారు నిమిషాలయి అలా ఆలోచనలో గడ్డ కట్టుకుపోయినట్టు టేబిలుమీద వున్న గడియారం కచ్చితంగా చెబుతున్నది. అలా గడ్డకట్టుకుపోవటానికి కారణం ఏమిటంటే రామారావు కాలేజీకి కట్టాల్సిన ఫీజు కట్టలేదు. ఫైనుతో కట్టవలసిన సమయం కూడా మించిపోతున్నది. తండ్రి దగ్గర రామారావు కాలేజీ ఫీజికని వసూలు చేసిన రొక్కాన్ని ఈ ఇద్దరు మిత్రులూ సినిమాలకూ, సిగరెట్లకూ, తిరగటానికీ వినియోగించారు. రాజు ఒక్కడూ రూమ్ లో వుంటున్న విద్యార్థి, రామారావు తల్లిదండ్రుల చాటున పెరుగుతున్న విద్యార్థి. రాజు తాను కట్టాల్సిందేదో కట్టేశాడు కాబట్టి, అతని దగ్గర డబ్బు లేదు; రామారావుకు ఎక్కడనుంచీ డబ్బురాదు. ఇప్పుడా డబ్బు సంపాయించి, ముందు కాలేజీకి ముడుపు చెల్లించాలి. దానికోసమనే ఈ ఉభయులూ ఆలోచన మీద ఆలోచన గావిస్తూ, మధ్యలో పోజులు మారుస్తూ, సిగరెట్లు పీలుస్తూ ఇంతనేపాయి కిందా మీదా పడుతున్నారు.
కిందనున్న శేషశాయి, చెయ్యి మార్చుకుని నిట్టూర్చి ‘హోహో’, అన్నాడు. కుర్చీలోని రాజుగారు ‘హోహో’ అన్నారు. ‘హోహో’ అంటున్నావు. ఏదయినా తట్టిందేమిటోయ్!’ అన్నాడు లేవకుండానే రామారావు – అతనికి ఏకోశానా తట్టిచావడనే దృఢ నమ్మకం గలవాడవడంచేత,
‘నా బొంద తట్టింది. నువ్వు ‘హాహా’ అన్నావని నేను హోహో అన్నాను’ అన్నాడు రాజు
సిగరెట్టుముక్క నక్కివుందేమోనని కేసులో గాలిస్తూ.
–
– పొరపాటున ఎక్కడైనా
మరో పదినిముషాలు ఇద్దరూ తలకాయలు బద్దలు చేసుకున్నాక ‘రాజా’ అన్నాడు రామారావు లేచి కూచుని.
‘ఏం మంత్రి? ఐడియా దొరికిందా?’.
‘దొరికింది. ఈరకం ఆలోచన ఇంక లాభం లేదనేది’
‘ఇంకోరకం ఆలోచన ఎలా చేదామో అదీ చెప్పు!’
‘ఎక్కడికయినా వేటకు వెళితే?’
‘నయాపైసా రాలదు. ఆపైన నీయిష్టం’
ఇద్దరూ కలిసి డబ్బు దొరికే చోట్లు ఎక్కడైనా వున్నాయేమోననీ, ఎవడైనా అప్పిచ్చే నాథుడున్నాడేమోనని తెగ ఆలోచించారు మళ్ళీ. పైసా లాభం లేకపోయింది.
‘వైద్యుడెవడైనా నీకు తెలిసినవాడు లేడూ, అప్పిస్తాట్ట’ అన్నాడు రామారావు.
“అప్పిచ్చువాడు వైద్యు డన్నారనా – ఏ వైద్యుడూ ఇవ్వడు. కనీసం ‘మాకు’ కూడా ఇవ్వడు!”
“ఏం సాధనం?”
అంటే
“ఏం సాధనం?” అనుకున్నారిద్దరూ.
టానిక్ తాగితే బలం వచ్చినట్టుగా – టీ తాగితే ఐడియా వస్తుందని ఎవరో చెప్పారట. ఇద్దరూ బయల్దేరి రాజు జేబులో మిగిలిన చిల్లర డబ్బులతో టీలు తాగారు. కొంతదూరం అట్లా అట్లా నడిచారు. రోడ్లు కొలిచారు. వీధులన్నీ సర్వే చేశారు.
ఇక తిరగలేక, రాజా రామారావులూ ఒక సందు పక్కనేవున్న తూముగట్టుమీద చతికిలపడ్డారు. ఈ తిరగడంలో కొంతమంది మిత్రులలాంటి వారు తారసిల్లగా, తృణమో రుణమో ప్రాధేయపడ్డారు. ఉన్న మిత్రులంతా కలిసి తలో ఐదూ, కనీసం పదీ ఇచ్చినా చాలని అభిప్రాయపడ్డారు. అదీ పారలేదు. ఇంతవరకూ పైసా ఐనా దొరక్కపోగా కనీసం అయిడియా ఐనా దొరకలేదు.
తూము గట్టుమీద జేరబడిపోయిన రాజుకు దూరంగా పోతున్న ఓ అబ్బాయిని చూడగానే అద్భుతమైన, మహోన్నతమైన ఐడియా వచ్చేసింది. ఒక్క నిముషం ఆలోచించి – ఠక్కున లేచి నించుని ‘దొరికింది’ అని అరిచాడు. “గట్టిగా పట్టుకో, వదలకు” అన్నాడు రామారావు హాస్యంగా.
“చూస్తూ వుండు. దీన్ని మించిన పథకం లేదు. పద రూమ్‌కు” అని లేచాడు. చెబుతేగాని లేవనన్నాడు. రామారావు. వస్తేగాని చెప్పనన్నాడు రాజు. కొంతసేపటికి రాజే నెగ్గాడు.
రూముల్లో కూచుని ఇద్దరూ మళ్ళీ మొదటి పోజుల్లోకి వచ్చారు. రాజు ప్రారంభించాడు –
“ఏమిటంటే – మీ నాన్నకు నువ్వు అంటే ప్రియమేనా?”
“లక్ష రూపాయిల ఖరీదనుకో”
“మధ్యలో నువ్వేం మాట్లాడనవసరం లేదు. చెప్పిందంతా విను. అంతేత, ప్రియమైన చవకయినా ఏ తండ్రీ, కొడుకు కనిపించలేదంటే కంగారు పడతాడు. ఈ క్షణం నుంచీ నువ్వు మీ నాన్నకు కనిపించవు. ఎవరికీ కనిపించవు. రూమ్‌లోనే వుంటావు, రెండురోజులు పోయాక, నీకోసం అని నేను మీయింటికి వెళతాను. ఈలోపలే మీనాన్న నువ్వు కనిపించలేదని నీకోసం రావచ్చుననుకో. అప్పుడు నువ్వు బాత్రూమ్లో వుంటావు. నీకోసం అంతటా గాలిస్తాము. ఎక్కడా దొరకవు. ఇంక గత్యంతరం లేదని, నీ ఫోటో పేపర్లో ప్రకటించి, ఫలానావాడు తప్పిపోయాడని, వెదికి
తీసుకొస్తే వెయ్యి రూపాయలు బహుమానమని వేస్తాము.
నేను బయల్దేరి తీసుకొస్తానంటాను. బయల్దేరుతాను. రెండురోజులు ఊరుకున్నాక నిన్ను తీసుకెళ్ళి మీ నాన్నకు వప్పగించి ఆ వెయ్యో, వెయ్యి నూటపదహార్లు పుచ్చుకుంటాను. ఇది ధోకాలేని ఐడియా. ఎన్ని గంటలు సేపు చర్చ పడొచ్చు, ఎంత చక్కనిది తేలింది. తిరుగులేదు. ఆ వచ్చిన డబ్బులో కాలేజీకి కట్టాల్సిందేదో కట్టేసి, మిగిలినదాంతో…” అని రాజు ఠక్కున ఆగిపోయాడు రామారావును చూసి. ఈ మహత్తరమైన ఐడియాను, ఐడియాలోని వెయ్యిరూపాయలనూ విన్న రామారావు అమాంతం మూర్ఛపోయాడు. తన ధోరణిలో ప్రసంగించుకుంటూ పోతూ రాజు ఇది గమనించలేదు.
“ఓయ్ రామారావు – రామ్…” అని నీళ్ళు చల్లి లేపి గట్టి, సగర్వంగా నవ్వొకటి వెదజల్లాడు రాజు. “ఏమిటో అనుకున్నాను రాజా! నువ్వు సామాన్యుడివి కావు. నీ తలకాయ ఈలోకంలో వుండవలసినదికాదు. ఏమి ఐడియా రాజా, ఏమి ఐడియా” అన్నాడు రామారావు వొళ్ళు మరచిపోయి.
“సరే, ఇంక నువ్వు చేయ్యాల్సింది చాలావుంది. నువ్వే ఇంక రాజువి. అంటే మరేంలేదు. రాజులాగా ఈరూమ్న కోటగా భావించుకుని, కాలు కదపనఖర్లేకుండా కొన్నాళ్ళు జీవిస్తావు. మన మిలి టికెట్లు పెట్టి కారియర్ తెప్పించుకుంటాము. నీకు కావలసిన సదుపాయాలన్నీ నేను చేస్తాను. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా…”
“ఒకవేళ జానకి ఈ వీధిలోంచి పోతేనో?”
“పోయినా, ఇక్కడికి వచ్చి నిన్ను పిలిచినా సరే – నువ్వున్నట్లు తెలియనివ్వరాదు. కాస్త – జారిందా, గోవిందా! ఆ తర్వాత చాలా అవస్థ. ”
“సరే నువ్వుకూడా ఎవరికీ చెప్పరాదు. నాకోసం నువ్వు కాఫీ, టిఫిను తెస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను చూస్తే గీస్తే…”.
“చూడనీ నాకోసమే అనుకుంటారు. ఐనా అదంతా నేను చూసుకుంటా లేవోయ్- నువ్వు మాత్రం…” “చాలా జాగ్రత్తగా వుండాలి. జైల్లో వున్న దొంగలాగా.”
“అదిగో, అలా మాట్లాడితే నాదేంలేదు. నీయిష్టం. ఒక్క నాలుగురోజులు కష్టపడు కష్టమేమిటనలు- సుఖపడు, తర్వాత వుందిగా! నీకోసం పత్రికలూ, పుస్తకాలూ తెచ్చి పడేస్తాను. సరే, నువ్వువుందు. నేను వెళ్ళివస్తాను” అని రాజు లేచి, ముఖం కడిగి రూముకు తాళం పెట్టి వెళ్ళిపోయాడు. రామారావు ఉషారుగా ఈలోకటివేసి ‘లాలా లలా
లలలా’ అని పాడి కింద దొర్లాడు.
–
రామారావుకు ఆ సాయంత్రం హాయిగానే గడిచిపోయింది. రాజు టిఫినూ, కాఫీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఇచ్చాడు. మరి కొస్సేపటికి బాత్రూములో దూరి చల్లగా స్నానం చేశాడు. రాజు లుంగీ కట్టుకున్నాడు, టేబిలు లైటు వేసి, పత్రిక తీసి చదువుకున్నాడు. అప్పటికి ఆరున్నరయింది. రామారావుకు పత్రికా పఠనం సాగలేదు. ఆలోచనలో పడ్డాడు. సాయంత్రం ఇంట్లో వుండడం అన్నది బహుశా తన జీవితంలో ఇదే ప్రథమం. ఈపాటికి తెల్లటి గుడ్డలు
వేసుకుని సిగరెట్లు కాలుస్తూ – అన్నట్టు ఈ రాజుగాడు సిగరెట్లు ఇవ్వకుండా పోయాడే అని తిట్టుకున్నాడు. అక్కడక్కడైనా ఏమైనా మిగిలిఉన్నవేమో చూశాడు. కొత్త దొరకలేదు. పోనీ ఈపాటికి తెల్లటి గుడ్డలు వేసుకుని సిగరెట్లు కాలుస్తూ ఏ సినిమా హాలు గేటు దగ్గరో, జానకి వీధి లోనో ఉండవలసిన తనూ, ఇలా ఎవడిదో వూరివాడి ఎవరు లుంగీ ధరించి, దొంగతనంగా పడివున్నాడు.
రామారావు విధి, కర్మ, వ్రాత వంటి మామలూ, ‘రాజ కింకరుడౌను…’ అని వ్యాక్యాలు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాడు. ఈపాటికి తనవాళ్ళు తనకోసం ఆరాటపడరు. ఎందుకంటే, తన సాధారణంగా తొమ్మిదింటికి కానీ ఇంటికి వెళ్ళడు. ఒకవేళ తొందరగా చేరినా, చదువుకోవాలనే మిషమీద భోజనం చేసిలెంనే బయిల్దేరి ఏ సినిమాకో పోతాడు. అంచేత చెప్పకుండా ఎక్కడకీ వెళ్లడం అని గానీ, ఎక్కడైనా ఉండోవటం గానీ సామాన్యంగా తన పద్ధతిలో జరిగే పనికాదు. ఈ తొమ్మిది తర్వాత గాని, ఏ అలజడీ బయల్దేరదు. తెల్లవారేసరికి తన కనిపించలేదని సంగతి ఊరంతా పాకవచ్చును.జానికికి కూడా తెలుస్తుందా? ఫలానా రామారావెవడో కనిపించటం లేదని తెలిస్తే తెలియవ్చును. అంతకన్నా ఆ అమ్మాయికేమీ తెలియదు. జానికిని తనెరుగును గానీ, ఇలా రామారావు చాలా సేపు చాలా చాలా ఆలోచించాడు. ఎందుకో అతనికి నెమ్మదిగా నిద్రపట్టింది.
సుమారు తొమ్మిది గంటల ప్రాంతాలో రాజా టిఫిన్ పొట్లాలతో వచ్చి తలుపు తాశం తీసి, లోపల ప్రవేశించాడు. “నా రాజే” అనుకున్నాడు రాజు, నిద్రపోతున్న రామారావును చూసి. తలుపుకు లోపల వేసి గడియవేసి, దుస్తులు మార్చుకుని రామారావును అడిగాడు.
“ఫూ – ఇదేమిటయ్యా పొట్లాలు తెచ్చావు? భోజనమో?” అన్నాడు రామారావు బద్ధకంగా లేస్తూ.
“భోజనానికి కారియరు దొరకలేదు. రేపు సర్దుతానన్నాడు హోటలు వాడు. ఈపాటికి ఈ టిఫిను కాని. దీని డబ్బుల కోసం నేనంత యాతన పడ్డానో నువ్వెరుగవు” అన్నాడు రాజు. మాట్లాడకుండా రామారావు ఆ పొట్లాలు విప్పి, తిని – మంచినీళ్ళు తాగి –
–
“ఎమనుకుంటున్నారోయ్?” అన్నాడు ఏదో ఘనకార్యం చేసినవాడల్లే ఫోజు కొడుతూ.
“ఇంకా ఏమీ అనుకోవడం లేదు. అనుకుంటారులే. ఈ రాత్రి కళ్లు మూసుకో”
“చాలా ఇబ్బందిగా వుంది రాజు! నువ్వయినా లేవు”
రాజు సమాధానం చెప్పలేదు. తెచ్చిన సిగరెట్లు అతని ముందు పడేశాడు. కొస్సేపు ఇద్దరూ ఏదేదో మాట్లాడుకుని దీపం ఆర్పేసి, నిద్రకు ఉపక్రమించారు.
కాస్సేపటికి వీధి తలుపు చప్పుడుయింది. ‘రాజు గారూ’ అంటూ ఎవరో పిలుస్తున్న పిలుపు విన్నారు. “చచ్చాం” అన్నాడు రామారావు చట్టున లేచి కూర్చుని.
“ఏమీ చావఖర్లేదు. కాస్సేపు బాత్రూమ్లోకి పో. నేను చూసుకుంటాను”
“ఆ వచ్చేవాడు బాత్రూమ్లోకి వెళ్తానని వస్తేనో అంటే?”
“అంటే చూద్దాం లేవయ్యా – నువ్వు వెళ్లు” అని రామారావును పంపించేసి, తాను వెళ్ళి తలుపు గడియ తీసి
‘ఎవరూ?’ అన్నాడు రాజు.
“నేనండి రామారావు తమ్ముడిని. మా అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. ఇక్కడున్నాడేమోనని…” “ఇక్కడ లేడే. ఏశీ, ఎంతసేపయింది వెళ్ళి?” అన్నాడు రాజు. బాత్రూమ్లో పొంచివున్న రామారావుకు కూడా ఈ మాటలు వినబడ్డాయి. అతను పొంగిపోయి చిటికె వేశాడు.
“మధ్యాహ్నం గావును వెళ్లాడు. ఇంకా ఇంటికి రాలేదు.”
“భోజనానికి రావాలన్నమాట”
“అవునండి”
రామారావుకు చిరాకేసింది. వాడికి మరికొంత ఆత్రుత కల్పించి పంపించెయ్యక ఈ బాతాఖానీ ఎందుకని విసుక్కున్నాడు.
“వస్తాడులే – ఏ సినిమాకన్నా వెళ్ళాడేమో” అన్నాడు రాజు.
“అన్ని సినిమాలూ విడిపెట్టేశారుండీ” అన్నాడా అబ్బాయి.
అబ్బాయి
“ఐతే మరి ఎక్కడకెళ్ళి వుంటాడబ్బా!… ఏమో నాయనా, నాకు తెలియదు. పొద్దున్నెప్పుడో నాకు కనిపించాడు. గాని, మళ్ళీ కనిపించలేదు. ఇక్కడికి వస్తే వెంటనే పంపించేస్తాలే…” అన్నాడు రాజు. సరేనని వెళ్ళిపోయాడు. రాజు తలుపు గడియవేసి వెనక్కు తిరిగేసరికి రామారావు పక పక నవ్వుతూ కనిపించాడు. “నెమ్మదిగా నవ్వు నాయనా మీవాడింకా మెట్లు దిగి ఉండడు” అన్నాడు రాజు నెమ్మదిగా. “సరేగాని… కోటలో పాగేవేసినట్లే. చూస్తావా. పదిన్నరకే అలజడి కలిగిందీ” అన్నాడు రామారావు పక్కమీద
వాలిపోతూ.
ఆ ముగ్గురు ఉదయం మళ్ళీ ఎవరన్నా మిత్రులిద్దరూ చూశారు. ఎవరూ రాలేదు. కారియర్ భోజనం ఏర్పాటు చేసి, తానంత తిని రాజు కాలేజీకి బయల్దేరాడు.
“మా ఇంటి మీదుగా వెళతావా రాజూ” అన్నాడు రామారావు.
“ఉండవయ్యా మనం కాదు ఆత్రుత పడవలసింది – వాళ్ళు ” అన్నాడు రాజు.
అందుక్కాదు. రాత్రి మా తమ్ముడు వచ్చాడుగా. నేను వచ్చానో లేదో అని మా ఇంటికి వెళ్లవచ్చువునేమో అని…” “చూద్దాంలే” అని రాజు, తలుపు తీసుకుని బయట తాళం పెట్టి వెళ్ళిపోయాడు. రామారావుకు ఏడుపు వచ్చినంత పనైంది. ‘వీడి పొగరూ వీడూను’ అనుకున్నాడు. ‘ఇప్పుడు ఏ దానికీ నేను మాట్లాడరాదనేగా వీడి ప్రవర్తన…. కానీ కానీ ఎన్నాళ్లు!’ అని రామారావు ప్రతికలు తీశాడు. అవి రుచించలేదు. విసిరేశాడు.
రాజు, రామారావు ఇంటి గుమ్మం ముందు అగి – ‘రామారావూ’ అని కేకేశాడు. లోపల్నుంచి రామారావు తల్లి వచ్చింది. “ఏం నాయనా, మావాడు కనిపించాడా? నిన్ననగా వెళ్ళాడు. రాత్రి రాలేదు. పొద్దున్నా రాలేదు. మాహా ఉంటే నీతోనే ఉంటాడు.ఎక్కడికి వెళ్ళాడో నీతో చెప్పలేదా రాజు?” అని అడిగింది ఆమె ఆత్రుతగా అన్ని ఏకరవు
పెడుతూ.
“లేదండీ నిన్న పొద్దున్నే నాకు కనిపించాడు. మళ్ళీ లేదు. నిన్న రాత్రి మీ అబ్బాయి వచ్చాడు. అప్పుడే
వద్దామనుకున్నాను. ఐనా కాస్సేపటికి వచ్చేస్తాడేమో అని రాలేదు. ఇదేమిటండీ, ఇంతవరకూ రాకపోవడం ఏమిటి?” అని రాజు ఒకటో నెంబరు మేటి నటుడల్లే ఆశ్చర్యం అభినయించాడు. ఇంతలో రామారావు తండ్రిగారు లోపల్నుంచి రాగా ఆ ఆశ్చర్యంలోనే చెమ్చాడు సానుభూతిని మిళాయించి – “నమస్కారమండీ” అన్నాడు. “ఏం, తేలిందా వీడి సంగతి” అన్నాడాయన.
“ఏమిటో నాకూ ఇప్పటిదాకా తెలియదండీ. ఇప్పుడే అమ్మగారు అంటూవుంటే విన్నాను. మీరేమన్నా కేకలు వెయ్యడం వంటివి ఏమయినా చేశారా ఏమిటి?” అన్నాడు రాజు.
“ఏమీలేదు నాయనా, వాడిని కేకలేసేది ఎవరు ఈ యింట్లో? ఇదిగో, ఎప్పుడైనా అంటే ఈయన అంటారు ఓమాట. అదీ ఏమిటి మరీ చదువు ఎగవేస్తూ వుంటే” అన్నది రామారావు తల్లి. ఇంతలో రామారావు తమ్ముడు.
వీధిలోంచి వస్తూ
–
“అమ్మా! ఉదయం సుబ్రమణ్యానికి కనిపించాట్ట” అన్నాడు. రాజు గుండె తపీమనీ ఆగిపోయింది. “ఎ ఎ ఎ….క్కడ?” అన్నాడు.
“అదెక్కడో చెప్పలేదు గాని, పొద్దున్న చూశానే అన్నాడు” అన్నాడు రామారావు తమ్ముడు. రాజుకు కాళ్ళూ, చేతులూ గిల గిల తన్నుకున్నట్టయింది. కొంపదీసి ఈ వెధవ బయటకొచ్చేయలేదుగదా! ఎలా వస్తాడు తాళం తనదగ్గర వుంటే అతనికి అర్ధం కాలేదు.
“ఐతే ఆ సుబ్రమణ్యం ఏమన్నాడు?” అన్నాడు రామారావు తండ్రి. “ఏమో, నేను అడిగితే ఆ మాట అన్నాడు – మళ్ళీ ఏమీ అనలేదు”
“ఏడిసినట్టుంది. వాడి నిర్వాకమూ, నీ నిర్వాకము” అని గనురుకున్నాడు. బట్టతలాయన కొడుకు మీద.
“ఎందుకు నే కనుక్కుంటా లెండి” అని రాజు బయలుదేరాడు.
–
బయలుదేరిన రాజుకు ఎటు వెళ్ళడమో తేలలేదు. తన రూముకు వెళ్ళి రామారావు వున్నాడో లేదో చూసుకోవడమా, సుబ్రమణ్యాన్ని కలవడమా! సుబ్రమణ్యమే అబద్ధం చెప్పాడో, రామారావు తమ్ముడే కోశాడో అతనికి అర్ధం కాలేదు. “దిక్కుమాలిన సాద”
అని విసుక్కున్నాడు, తన రూము వేపు వెళ్తూ.
రూము తాళం వేసింది వేసినట్టే వుంది. తాళం తీసి చూడగా – గుడిలో దేవుడల్లే రామారావు కనిపించాడు. “మళ్ళీ వచ్చావేం?” అన్నాడు రామారావు.
–
“నా బొందా నా కర్మానూ. ఇదేదో ఈ అవస్థలతోనే పోయేట్టుంది. నువ్వేమో ఉదయం ఆ సుబ్రమణ్యానికి కనిపించావని వాడు చెప్పగా – నీ తమ్ముడు మీ యింటి దగ్గర చెప్పేడు. ఇందులో ఎవరిమాట అబద్ధం? – అబద్ధం మాటకేం గాని నా తాడు తెగింది. మళ్ళీ పాలోమని పోవాలి” అని చిరాగ్గా వెళ్ళి తలుపు తాళం పెట్టి నిష్క్రమించాడు రాజు రామారావు ఏదో అంటున్నా వినకుండా.
రాజుకు ఇంత చిరాకు ఎందుకో రామారావుకు అర్ధం కాలేదు. ఈ బందిఖానా బతుక్కి తాను చిరాకు పడాలిగాని, వీడికెందుకో చిరాకు? కొంపదీసి – ఏదన్నా దురాలోచనతో లేడుగదా! అంటే ఆ డబ్బు కాస్తా తన చేత చిక్కించుకుని, తనని పో పొమ్మనడు గదా! ఏడిశాడు. అదేమయినా జరిగితే తను లేడూ సత్యాన్ని లోకానికి
చాటడానికీ! పోతే తన పరువు పోతుంది గాని, రాజుగాడి పథకం పారనిస్తానా!…. ఐనా రాజు అటువంటివాడుకాడు, అటువంటిపని చెయ్యడు – అని సర్దుకున్నాడు రామారావే.
కాలేజీలో రాజూ, సుబ్రమణ్యం కలుసుకున్నారు.
“ఏంవయ్యా – నీకు రామారావు కనిపించాడా?” అని అడిగాడు రాజు.
“ఏ రామారావు?” అన్నాడా సుబ్రమణ్యం ఏదో లోకం నుంచి దిగివచ్చిన వాడల్లే.
“ఏ రామారావు? ఏ. రామారావే”.
“36”
“ఐతే మరి పొద్దున చూశానని రామారావు తమ్ముడితో చెప్పావుట”
“అవున
–
మా అన్నయ్య కనిపించాడా అని అడిగాడు. ‘ఆ’ అన్నాన కనిపించాడేమోననుకుని…” అన్నాడు సుబ్రమణ్యం ఏడిసినట్టు.
“చంపావుగదయ్యా రామారావు నిన్నట్నుంచి కనిపించక అందరమూ అవస్థ పడుతున్నాము. నువ్వేమో చూసానంటే ఎక్కడో కనుక్కుందామనుకున్నాను. కోతలయినా అర్థం వుండాలి” అని రాజు చరచరా వెళ్ళిపోయాడు. “ఏమిటీ…. రామారావా నిన్నట్నుంచా కనిపించకపోవడమా – మైగాడ్ ! రామారావు కనిపించకపోవడమే!… రామారావు కనిపించడం లేదు, రామారావు కనిపించడంలేదు” అని ఎలుగెత్తి అరుస్తూ కాలేజీ ఆవరణలోకి పరుగెత్తాడు. సుబ్రమణ్యం.
ఆ సాయంత్రం కాలేజి నుంచి వస్తూనే రాజు, రామారావు ఇంటికి వెళ్ళాడు. తండ్రి లేడు. తల్లి మాత్రం వుంది. ఆమె స్థితి చూడగానే రాజుకు జాలి కలిగింది.
–
ఆమెకు మధ్యాన్నం తిండి లేదుట ఒకటే బెంగట! ఈ నాటకం ఎందుకు ఆడుతున్నామా పాపం అనిపించింది రాజు హృదయంలో ఓ మూల.
-“మీరేం దిగులుపడకండి అమ్మగారూ. వస్తాడు. నేను తీసుకొస్తాగా. ఏమైపోతాడు? చిన్నవాడా చితకవాడా అర్జెంటుగా ఏ వూరన్నా వెళ్ళాల్సి వచ్చిందేమో! ఇవాళ చూద్దాం. రాకపోతే నేను వెళ్ళి నాలుగూ గాలించి, రేపు సాయంత్రానికల్లా లాక్కొస్తాను. మీకెందుకు వాడిని తీసుకొచ్చే బాధ్యత నాదిగా” అని ధైర్యం చెప్పి, బజార్లో కాస్త టిఫిను, పొట్లాం కట్టించుకుని రూము చేరాడు రాజు.
వేశాడు.
“ఏమయ్యా రాజూ! ఇంకెన్నాళ్ళీ బందిఖానా! చేస్తున్నాను బాబూ నీకేం?” అని రామారావు ఏడుపు మొహం
“ఉండవయ్యా రామయ్యా. ఇంకెంత రేపొక్క రోజు!”
“రేపొక్క రోజు ఎట్లాగేం – మా నాన్న ఫోటో ఇవ్వాలి – అది పత్రికలో పడాలి – పడిన వెంటనే నువ్వు నన్ను తీసుకుపోతే బాగుండదు. మరో రెండురోజులు ఆగాలి. ఓయ్ నాయినోయ్”
“ఇష్- అట్లా కేకలెయ్యకు వ్యవహారం మంచి పట్టులో వుంది” అని రాజు జరిగిన విషయాలన్నీ చెప్పాడు.
ఆ రాత్రి రామారావు, రాజు ప్రాణం తీసినంత పనిచేశాడు. సెకండ్ షో సినిమాకు పోదాం అంటాడు. రాత్రిపూట ఎవడు చూడొచ్చాడంటాడు, బ్రతుకు దుర్భరంగా వుందంటాడు. కావాలంటే తలపాగా చుట్టుకుని, కింద క్లాసులో కూచుంటా నంటాడు. రామారావును సముదాయించి, బుజ్జగించి, ఒక్క రోజు ఓపిక పట్టమని ప్రాధేయపడి అతన్ని పక్క మీద పడుకోబెట్టి, చిచ్చికొట్టి, జోలపాడి నిద్ర బుచ్చినాక గాని, రాజుకు స్థిమితం కలగలేదు.
రామారావు కనిపించక రెండు రాత్రులయింది కాబట్టి, ఇంక ‘పత్రికా ప్రకటన’ మాట ఎత్తవచ్చునని, కాలరెత్తుకుని రాజు రామారావు ఇంటికి వెళ్ళాడు. బట్టతలాయన బయట కూచుని చుట్ట కాల్చుకుంటున్నాడు. రాజును చూసి, ఆయన పలకరించను కూడా లేదు.
“ఏం, రాలేదాండీ?” అన్నాడు రాజు విచారంగా.
“వచ్చాడు” అన్నాడు తండ్రి, తుపుక్కున్న ఉమ్మి
రాజు గుండె మళ్ళీ థామ్మంది. రావడం ఏమిటి? ఇదేమిట్రా బాబూ అనుకున్నాడు.
“వాడెందుకొస్తాడయ్యా రాడు! ఈ ఇల్లు చేదు, మేమంతా విషం పెడుతున్నాం. ఎందుకు వస్తాడు మరి! రాడు” అన్నాడు తండ్రి నిబ్బరంగా.
‘అమ్మయ్యా!’ అనుకున్నాడు రాజు. “ఏమిటోనండీ, ఉన్నట్టుండి ఎందుకట్లా ప్రవర్తించాడో అర్థం కావటం లేదు” అన్నాడు ఓరగా ఆయనను చూస్తూ.
‘వెధవ ప్రవర్తనలకు అర్థం ఒకటి ఏడుస్తుందేమిటి! చావనీ నాకేం” అన్నాడు రామారావు తండ్రి మహాకోపంగా. “మీరు కోప్పడకండి. ఏమిటో, ఏం జరిగిందో! నిన్న నేను అందర్నీ అడిగాను. అన్ని వీధులూ చూశాను. మా స్నేహితులు అనుకున్న వాళ్ళందరి ఇళ్ళూ తిరిగాను. ఎక్కడా లేదు. బహుశా ఈ పూళ్ళోనే లేదేమోననిపిస్తుంది”
“ఏడవమను. నేనూ ఇవాళ కనుక్కొచ్చాను. కాలేజికి డబ్బు కట్టలేదుట. అది కాస్తా పట్టుకుని ఉడాయించాడు. పోతే పొమ్మను. అంతే, ఆ వెధవకి అదే దక్కుడు”
‘కాలేజీకి డబ్బు కట్టలేదూ? నాతో కట్టానన్నాడే” అన్నాడు రాజు ఏదో అనాలని.
“అదో అబద్ధం. ఇటువంటి అబద్ధాలకోరూ, దొంగవెధవా పోవడమే మంచిది. శని వదిలింది” అని రామారావు తండ్రి లేచి, కండువా భుజంమీద వేసుకుని లోపలకు పోయాడు. బట్టతలాయన అగ్గిబుగ్గయిపోతున్నాడే ఎట్లా అనుకున్నాడు రాజు. అక్కడ కాసేపు చతికిలబడి, ఆయన ఎంతకూ రాకపోగా లేచి లోపలకు వెళ్ళాడు.
“నాకు ఒక ఐడియా వచ్చిందండీ. రామారావు ఫోటో పత్రికలో వేయించి, తప్పిపోయాడు అని రాయించి…” అని రాజు చెప్పబోతున్నాడు.
“చెట్టంత వెధవ తప్పిపోవడం ఏమిటి, లేచిపోయాడు అని వేయించు” అని చిరాకుపడ్డాడాయన. “లేకపోతే ‘కనబడుటలేదు’ అని వేస్తాం. దీనివల్ల ఓ వెయ్యో, వెయ్యిన్నూట పదార్లో మీకు ఖర్చయినా, మనవాడు గ్యారంటీగా దొరుకుతాడు. ఇటువంటి కేసులన్నీ ఇట్లా పరిష్కారం కావలసిందే’
“వెయ్యో వెయ్యినూటపదాల్లో ఏమిటి?
“అదే – మనవాడిని తీసుకొచ్చిన వారికి బహుమానం. ఆ ఆశపెడితేనే గాని, ఎవరూ తీసుకురారులెండి. డబ్బు అంటే ఎక్కడున్నాసరే ఎవరయినా పడతారు.”
“ఇది నీ తెలివా, మరోడిదా! తెల్లారినట్టుంది బతుకు. వాడి ఫోటో పత్రికలో ప్రకటించే దండగ చాలక, బహుమానం ఒకటా, చాలు చాల్లే – ఐన దండగేదో ఐంది. చాలు” అని కోప్పడ్డాడు రామారావు తండ్రి. “దండగ ఏమిటండీ -ఎంతయినా మన అబ్బాయి” అన్నాడు రాజు కిర్రెక్కించాలని.
“అబ్బాయ్ ఈ పప్పులేం ఉడకవు. ఈ వెధవని రాళ్ళెత్తమన్నానా- గుళ్ళు మొయ్యమన్నానా- లక్షణంగా బుద్ధిగా చదువుకోరా అని బోలెడంత డబ్బు పోసి చదువు చెప్పిస్తూ వుంటే అది కిట్టక, పోయిన వెధవకోసం మళ్ళీ ఈ ఖర్చు కూడా ఎందుకు? పోతేపోతాడు. చూద్దాం ఎంతదూరం వెళతాడో! నేనేం వెతకను వెతికే ప్రయత్నమూ చెయ్యను” అన్నాడు రామారావు తండ్రి దూరంగా చుట్ట విసిరేస్తూ. రాజు గుండెలు గడ గడ లాడసాగాయి. కథేదో అడ్డం తిరిగేట్టుందని భయపడ్డాడు. ఈయన మామూలుగా ఒప్పుకుంటాడేమో అని అనుకుంటే ఇదేదో బ్రహ్మ ప్రళయం అయ్యేటట్టుండే,
“మీరంటే ఎ
–
మనవాడు, మన బిడ్డ ఏమయిపోతాడోనని మనం దిగులుపడాలి… మనం… మరి ‘ అన్నాడు రాజు ఏమంటున్నాడో తనకే అర్థంకాక.-
“పోవయ్యా వెధవను గంగలో దూకమను. నాకేం! నాదేమయినా తప్పుందా? ఉంటే నువ్వు చెప్పుతో కొట్టు! భరిస్తాను. వాడిని ఓమాట అన్నానా ఓ ఇదన్నానా- జీతం కట్టరా అని డబ్బిచ్చి నాలుగురోజులో వారం రోజులో అయింది. వాడి మీద నమ్మకం వుండబట్టేకదా రశీదు అడగలేదు! మరి అటువంటి నమ్మకద్రోహి ఇంకా ఎందుకయ్యా నా గడపలో? పోనిద్దూ వాడిష్టం వచ్చిన చోటుకుపోనీ. మనకెందుకు. నువ్వుకూడా ఎక్కడా వెతక్కు. నేనూ వెతకను. వాడే వస్తాడు. చూస్తూ వుండు” అన్నాడు రామారావు తండ్రి కచ్చితంగా.
రాజుకు ఇంకేమీ తోచలేదు. ఒళ్ళు వేడెక్కిపోయింది. కాళ్ళూ చేతులూ గిల గిలలాడసాగాయి. గుండె తొందరగా కొట్టుకుంటోంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. “ఐతే ప్రకటన వేయించ వద్దంటారా” అన్నాడు రాజు – తడబడుతూ. -“అంటారా ఏమిటి అన్నాను. అంతే! ఏమీవద్దు – ఏమీ వేయించను”
“మీకు తెలీదు….”
“నాకన్నీ తెలుసును పోవయ్యా”
రాజు మూర్ఛపోయినంత పనిజేశాడు. అంటే – కొంపదీసి తమ వ్యవహారం ఎరుగునా ఏమిటి చచ్చాం!
-“అంటే?” అన్నాడు నెమ్మదిగా.
-“అంటే లేదు. కొంటేలేదు. నువ్వు నా ప్రాణం తియ్యకు. మన తప్పేమీ లేకుండా, వూరికినే పారిపోయిన వెధవ కోసం డబ్బు ఖర్చుపెట్టాలా ఛీ..ఛీ – దరిద్రగొట్టు వెధవ పోనీ” అని బట్టతలాయన లేచి వెళ్ళిపోయాడు. రాజుకు తలా తోకా అందలేదు. నీటమునిగి పోతున్నవాడిలాగా కొట్టుకున్నాడు. ఆయన వెళ్ళిన వెనకే వెళ్ళి మళ్ళీ చెప్పాడు. ఆయన వినలేదు. ఆయన భార్య చేత కూడా చెప్పించాడు. ఏమీ లాభం లేకపోయింది. వాడి విషయం ఎత్తితే ఇంక వూరుకునేది లేదనికూడా రామారావుతండ్రి గద్దించాడు.
రాజు కాళ్ళీడ్చుకుంటూ రూము చేరి, ఈ శుభవార్త కాస్తా రామారావు చెవిని వెయ్యగా, రామారావు కొయ్యబారిపోయాడు.
“ఇంకేది దారి రాజూ” అన్నాడు రామారావు.
“ఇదే దారి. ఇట్లాగే పోయావంటే మీ ఇల్లొస్తుంది”
“హాస్యం ఆడుతున్నావా! ఇప్పుడా!” అన్నాడు ఏడుపుమొహం వేసి రామారావు.
“మన పాచిక పారనందుకూ, ఈ పడిన అవస్థకూర్వొస్తోంది. ఏడుపూ వస్తోంది. హాస్యం ఒక్కటేగాదు, విషాదం కూడా పలికిస్తాను” అని వాగ సాగాడు రాజు.
“చేసేది ఒకటే. ఇంక మీ నాన్న ఎట్లాగూ దానికి ఒప్పుకోదు. ఎన్నివిధాల చెప్పాలో అన్నివిధాలా చెప్పాను. మీ అమ్మగారూ చెప్పింది – ఆయన పట్టే ఆయనది. నువ్వే వస్తావనే నమ్మకంతో వున్నాడు. నువ్వు కాలేజీకి డబ్బు కట్టని సంగతికూడా ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి నువ్వు ఈరాత్రే ఇంటికెళ్ళి ఏదో పెద్ద బొంకు బొంకు. ఆ డబ్బు విషయం కూడా ఏదో చెప్పు. ఆయనే డబ్బిస్తాడు. అది తీసుకెళ్ళి కాలేజీకి కట్టు. అంతే. అంతకన్నా చేసేదేం లేదు. ఐందేదో ఐంది. ఇంకా నయం. ఆ అడిగేదేదో ఇవాళే అడిగాను. రెండురోజులు ఆగాను కాదు” అన్నాడు రాజు.
జరిగినదానికి వగచి లాభం లేదని రామారావు తెలుసుకున్నాడు. ఇంటికి వెళితే తన తండ్రి ప్రాణాలు తీసెయ్యడు. తిడితే తిడతాడు. పెద్ద అబద్దం ఆడితే అదే పోతుంది అని నీతి పాఠాలు కూడా చెప్పుకుని యింటికి పోవడానికే నిశ్చయించుకున్నాడు రామారావు.
కొంత భయంతోనూ, మరికొంత ఆలోచనతోనూ రామారావు వెంటనే ఇంటికి బయల్దేరలేకపోయాడు. రాత్రే వెళితే మంచిదని అతనికి తోచింది. తన తండ్రిది అదోరకం కోపం. రానంతసేపు రాదు. వచ్చిందా అది ఆగదు. ఆ భయంతోనే అతను నెమ్మదిగా ఆరాత్రి ఇంటికి బయల్దేరాడు.
తలుపుకొట్టటానికి రామారావుకు భయంగానే వుంది. తను చేసిన పనిమీద అసహ్యం కూడా కలిగింది. పెద్ద సాధించేవాడల్లే ఈ దంభాలూ, పథకాలూ తలచుకుని తనను తనే తిట్టుకున్నాడు. రాజు ఐడియా ఇచ్చాడు. ఇచ్చినంత మాత్రాన తనెందుకు ఒప్పుకున్నానా అని, ఇప్పుడు బాధపడ్డాడు. కాస్సేపు పోయాక తలుపు తట్టి పిలిచాడు. పిలిచీ
పిలవగానే వాళ్ళమ్మ వచ్చి తలుపుతీసి ‘నాయనా’ అని బావురుమంది.
–
-“ఏంరా, ఎక్కడికి దయచేశావు? కొంప ఇప్పుడు తెలిసిందా, వెళ్ళి అక్కడెక్కడో వుండకపోయావూ? భయం భక్తీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరగడమా పోపో నా ఇంట్లోకి రాకు పో” అని తలుపులు మూసేశాడు తండ్రి. రామారావు తల్లి ఎంతచెప్పినా, గోల పెట్టినా కూడా ఆయన తియ్యలేదు. బయట నుంచి రామారావు “నాన్నా, నాన్నా” అని ఎన్నిసార్లు పిలిచినా ఆయన తలుపు తియ్యనూ లేదు, సమాధానం చెప్పనూలేదు.
పిలిచి, పిలిచి రామారావు ఆ అరుగుమీద చీకట్లో చతికిలపడ్డాడు. బాగా ఏడుపొచ్చింది. ఏడిచాడు. తనవంటి వెధవకు కావలసిందే అనుకున్నాడు. తన తండ్రి మొండి పట్టుదల ఇప్పుడర్థమయింది. తనకింక ఈ ఇంట్లో స్థానం లేదా? – ఏవేవో ఆలోచించుకుంటూ, చాలాసేపు ఆ అరుగుమీదే కూచున్నాడు రామారావు.
తెల తెల వారుతూ వుండగా రామారావు తండ్రి లేచి, నెమ్మదిగా తలుపుతీసి తన కుమారుడి కోసం అరుగువంక చూశాడు. రామారావు అక్కడ లేడు! ఆయన గాభరాగా అటూ ఇటూ చూశాడు. రెండు మూడుసార్లు పిలిచాడు. ఎక్కడా జాడలేదు. రామారావు తల్లీ, తండ్రీ ఇద్దరూ గొల్లుమన్నారు. రామారావు ఈసారి నిజంగానే ఎక్కడికో వెళ్ళిపోయాడు.
రెండురోజులు గడచిపోయింది. ఆ రాత్రి రామారావు రాజు రూముకు వెళ్ళలేదు. రామారావు తండ్రీ, తమ్ముడూ, రాజూ అతనికోసం అంతటా చూశారు. ఎక్కడా కనిపించలేదు.
“వాడికి బుద్ధాస్తుందేమోనని ఆ మాట అన్నాను బాబూ! లేకపోతే రేప్పొద్దున్న కూడా ఇట్లాగే చేసి ఇంటికొచ్చి తలుపు కొడతాడు. తీసి లోపలకు రానిస్తే మనం లోకువ అవుతాం గదా అని, కాస్త శిక్ష విధిద్దామని అట్లా చేశాను. మళ్ళీ ఇంతపని చేస్తాడనుకోలేదు. వెళ్ళినవాడు ఇంటికి వచ్చాడని ఎంతో సంతోషించాను. ఈసారి ఎక్కడికి వెళ్ళాడో, ఏమైనాడో నాకు మరీ దిగులుగా వుంది” అని రామారావు తండ్రి కళ్ళు తుడుచుకున్నాడు. రాజుకు కూడా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
మరి కాస్సేపటికి రామారావు తండ్రి ఏదో వూహ తట్టిన వాడల్లే చట్టున లేచి గదిలోకెళ్ళి రామారావు ఫోటో ఒకటి వెతికి తీసి, బల్లమీద పెట్టాడు. “ఎంత బహుమానమయినా ఇద్దాం. ఆ పత్రిక చిరునామా ఏమిటి నాయనా. రాజూ!” అంటూ ఆత్రుతగా బయటకొచ్చాడు రామారావు తండ్రి, కలంతోనూ, కవరుతోనూ సహా!
(సశేషం)








