రష్యాకు తలవంచే ప్రసక్తే లేదు : జెలెన్స్కీ
రష్యాతో యుద్ధంలో తాము తలవంచే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం ద్వారా లక్షల మంది ఉక్రెయిన్ వాసులను పుతిన్ సేనలు అంధకారంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు దాడులు అణు యుద్ధం బెదిరింపులు, ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదర్కొన్నట్టు ఈ అంధకారాన్ని, కఠిన శీతాకాలాన్ని కూడా భరిస్తామని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. మేం స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం. కాబట్టి చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుందని మాకు తెలుసు. కానీ బానిసత్వంలో కూరుకుపోతే అంతకంటే ఎక్కువ పణంగా పెట్టాల్సి వస్తుంది అని అన్నారు.













