ఈ ఘటనను ప్రపంచంలో ఎవరూ మరచిపోలేరు
ఉక్రెయిన్పై దురాక్రమణలో రష్యా యుద్ధనేరాలు శృతిమించుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా సైన్యం చేతిలో బందీగా ఉన్న ఓ సైనికుడిని తల నరికి అత్యంత దారుణంగా చంపుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రష్యా తీరు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల కంటే దారుణంగా ఉందని ఆగ్రహించారు. ఐఎస్ఐఎస్ కంటే అత్యంత దారుణంగా పుతిన్ సేనలు ప్రవర్తిస్తున్నాయి. ఎదుటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఈ ఘటనను ప్రపంచంలో ఏవరూ మరిచిపోలేరు. హంతకులు దీనికి నైతిక బాధ్యత వహించాల్సిందే. ఇటువంటి భయంకర ఘటనలకు పాల్పడుతున్న వారిని ఓడించడంతో ఎంతో అవసరం.ఈ తరుణంగా ఐరాస భద్రతామండలికి రష్యా అధ్యక్షత వహించడం అర్థరహితం. ఉక్రెయిన్ నుంచి రష్యా ఉగ్ర మూకలను తరమియాలి అని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. యుద్దనేరంగా అనుమానిస్తున్న ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఉక్రెయిన్ హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. కాగా. ఈ ఘటనపై రష్యా స్పందిస్తూ అదొక భయానక దృశ్యం. దాని వాస్తవి కతను నిర్దారించాల్సి ఉందని పేర్కొంది. అయితే వాగ్నర్ గ్రూపు సభ్యులు ఇలాంటి దురాగతాలకు పాల్పడి ఉండొచ్చని సందేహిస్తున్నారు.













