చైనాకు మరో ముప్పు!
ప్రపంచాన్ని వణికించిన కరోనా పుట్టినిల్లు చైనా తాజాగా మరో ముప్పు ముంగిట నిలిచింది. కొవిడ్ మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాను మరో ప్రాణాంతక జబ్బు కలవరపెడుతోంది. అక్కడి చిన్నారుల్లో అంతు చిక్కని న్యుమోనియా వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఈ కొత్త రకం జబ్బు బారినపడిన వారితో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే కొవిడ్ మహమ్మారి ప్రారంభ దశనాటి దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి. ఈ నెల ఆరంభంలో చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్హెచ్సీ) అధికారులే స్వయంగా మీడియా సమావేశంలో అంతుచిక్కని న్యుమోనియా వ్యాధి పెరుగుదల గురించి వెల్లడిరచడం, పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.













