భారత్ కు అమెరికా మద్దతు
అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో భారత్‌కు అమెరికా మద్దతుగా నిలిచింది. ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా యత్నిస్తోందంటూ మండిపడింది. అమెరికా సెనెట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానంలో సెనెటర్లు ఈ మేరకు ప్రస్తావించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా బెదిరింపులు కొనసాగుతున్న తరుణంలో మా వూహాత్మక భాగస్వాములకు అండగా నిలబడటం ఎంతో కీలకం. సెనెట్‌లో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేస్తోన్న ప్రయత్నాలను ఖండిస్తోంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం అని నిస్సందేహంగా గుర్తిస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత కోసం అమెరికా`భారత్ భాగస్వామ్యన్ని, క్వాడ్‌ను మెరుగుపరుస్తాం అని ఆ తీర్మానం పేర్కొంది. గత కొన్నేళ్లుగా భారత్`చైనా సరిహద్దుల మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా నుంచి ఈ కీలక స్పందన రావడం గమనార్హం. చైనా, అరుణాచల్‌ప్రదేశ్ మధ్య మెక్‌మోహన్ రేఖనే అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు అమెరికా పునరుద్టాటించింది. ఇది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగమని డ్రాన్ చేస్తున్న వాదనలను తోసిపుచ్చింది.













