అమెరికా శాస్త్రవేతలు వినూత్న ఆవిష్కరణ
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు. అయితే ముందుగా గుర్తించడమే చాలా పెద్ద సమస్య. చాలామందికి ఆలస్యంగా గుర్తించడంతో ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే అమెరికా శాస్త్రవేత్తలు వినూత్న ఆవిష్కరణ చేశారు. కన్నీటీ సాయంతో క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్స్‌ను అభివృద్ధిపరిచారు. కాలిఫోర్నియాలోని టెరసాకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇన్నొవేషన్ సంస్థ ఈ ఆవిష్కరణ చేసింది. క్యాన్సర్‌ను గుర్తించేందుకు దోహపదడే బయోమార్కర్లు అయిన కన్నీటిలోని ఎక్సోసోమ్స్ను ఈ కాంటాక్ట్ లెన్స్ ఒడిసిపట్టుకుని గుర్తిస్తాయి. యాంటిబాడీలకు ఆతుక్కునే మైక్రోచాంబర్స్తో ఈ లైన్స్‌ను డిజైన్ చేశారు. దీంతో ఇవి ఎక్స్సోమ్స్ను ఒడిసిపడుతాయి. ఆ తర్వాత ఈ లెన్స్ (ఏపీఎస్‌ఎం-సీఎల్)ను స్టెయిన్ చేసి ఎక్సోసోమ్స్ను గుర్తించొచ్చు. దీంతో క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి సులువుగా చికిత్స అందించేందుకు వీలుగా కలుగనున్నది.













