ఈ బిల్లు పాసైతే…ఐటీ నిపుణులకు శుభవార్తే!

అమెరికాలో శాశ్వత నివాసం కోసం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రీన్‍కార్డుల జారీకి కీలక ముందడుగు పడింది. గ్రీన్‍కార్డుల జారీలో ప్రస్తుతం దేశాల వారీగా ఉన్న 7 శాతం కోటాను (కంట్రీ క్యాప్‍ను) తొలగిచాలంటూ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్‍కార్డుల జారీలో సమానత్వం, తీసుకురావాలనే ఉద్దేశంతో 2021 ఈక్వల్ యాక్సె టు గ్రీన్‍కార్డు ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) యాక్ట్, 2021 పేరటిట ఈ బిల్లును కాంగ్రెస్ మహిళా సభ్యురాలు జో లోఫెగ్రెస్, మరో కాంగ్రెస్ నేత జాన్ కర్టిస్ ప్రవేశపెట్టారు.
అలాగే, కుటుంబ ఆధారిత వీసాలపై ఉన్న ప్రస్తుతం 7 శాతం పరిమితినీ 15 శాతానికి పెంచాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు పాసైతే దశాబ్దాల తరబడి గ్రీన్‍కార్డు కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరుగుతుంది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సెనేట్‍లో గట్టెక్కాల్సి ఉంటుంది.