భద్రతా మండలిలో అమెరికా, చైనా ఢీ
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో అమెరికా, చైనా పరస్పరం విమర్శల దాడికి దిగాయి. దక్షిణ చైనా సముద్రంలో రెచ్చగొట్టే చర్యలు తగవని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ పరోక్షంగా చైనాను హెచ్చరించారు. ఇతర దేశాలను భయపెట్టి, న్యాయంగా వాటికి దక్కే వనరులను వినియోగించు కోకుండా చేయడం మంచిది కాదని చెప్పారు. దీనిపై చైనా ఉప శాశ్వత ప్రతినిధి డయ్ బింగ్ స్పందిస్తూ దక్షిణ చైనా సముద్రం అంశాన్ని చర్చించడానికి భద్రతా మండలి సరైన వేదిక కాదని అన్నారు. ఈ అంశాన్ని అమెరికా ప్రస్తావించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.













