12 ఏళ్ల తర్వాత మళ్లీ దక్షిణ అమెరికాకు
దక్షిణ అమెరికాకు చెందిన ఉరుగ్వే పురుషుల ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్-20 వరల్డ్ కప్ చాంపియన్గా అవతరించింది. దాంతో, 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన తొలి దక్షిణ అమెరికా దేశంగా రికార్డు సాధించింది. అంతేకాదు వరుసగా నాలుగేళ్లుగా ట్రోఫీని తన్నుకుపోతున్న యూరోపియన్ దేశాలకు చెక్ పెట్టింది. డిగో మారడోన స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఉరుగ్వే 1-0తో ఇటలీపై గెలుపొందింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ లుసియానో రోడ్రిగెజ్ 86వ నిమిషంలో గోల్ కొట్టాడు. దాంతో, ఉరుగ్వే జట్టు ఆటగాళ్లంతా సంబురాలు చేసుకున్నారు. ఇది చాలా క్రేజీ క్రేజీ క్రేజీ మేము ఈ విజయాలకు అర్హులం. మా కలను నిజం చేసుకున్నాం అని రోడ్రిగ్ మ్యాచ్ అనంతరం ఉద్వేగభరితంగా చెప్పాడు. ఉరుగ్వే 1997, 2013లో ఫైనల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. దక్షిణ అమెరికాకు చెందిన బ్రెజిల్ చివరిసారి 2011లో అండర్ వరల్డ్ కప్ అందుకుంది.













