రష్యాకు ప్రజల తరలింపు.. తప్పుపట్టిన అమెరికా
యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్ నుంచి రష్యాకు ప్రజల్ని బలవంతంగా తరలించడం తగదని అమెరికా పేర్కొంది. పిల్లలు సహా వేల మందిని ఇలా పంపించి, జనాభా పరంగా మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించడం యుద్ధ నేరమేనని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆక్షేపించారు. దాదాపు 16 వేల మంది ప్రజల్ని ఆక్రమంగా రష్యా ఆధీనంలోని ప్రాంతాలకు తీసుకెళ్లారని, వేర్వేరు కారణాలతో మరికొన్ని వేలమంది ఆచూకి తేలియకుండా పోయారని చెప్పారు. మరోవైపు దక్షిణ ఉక్రెయిన్లోని మైకొలైవ్పై రష్యా బలగాలు క్షిపణులతో దాడి చేశాయి. ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. జపోరిజిజియా పైనా క్షిపణులు విరుచుకుపడ్డాయి. లుహాన్స్క్ ప్రావిన్సును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ రెండు దేశాల సైనికులు హోరాహోరా తలపడ్డారు.













