అందుకోసం ఏం చేయడానికైనా ఇంగ్లండ్ సిద్ధం
ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం చేస్తామని ఇంగ్లండ్ ప్రకటించింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడారు. మరో 30 కోట్ల పౌండ్ల మేరకు సైనిక సాయం అందిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ పోరాట పటిమ అద్భుతమని కొనియాడారు. ఈ పోరులో ఉక్రెయిన్ గెలిచి తీరాలి. అందుకోసం ఏం చేయడానికైనా ఇంగ్లండ్ సిద్ధం. కీవ్ ఆక్రమణ యత్నాన్ని తిప్పికొట్టడం ద్వారా ఉక్రెయిన్ ఇప్పటికే 21 శతాబద్ధంలో అత్యంత గొప్ప సాయుధ విజయాన్ని నమోదు చేసింది అని ప్రశంసించారు. ఉక్రెయిన్‌కు 13 ప్రత్యేక బులెట్ ప్రూఫ్ టొయేటా టాండ్ క్రూజర్లు పంపనున్నట్లు ఇంగ్లండ్ చెప్పింది.













