కోలాహలంగా ప్రారంభమైన… జి-7 సదస్సు

ఇంగ్లాండ్‍లోని కార్బిస్ బే రిసార్టులో జి-7 సదస్సు కోలాహలంగా ప్రారంభమైంది. కరోనా నేపథ్యంతో నేతలు ఒకరికొకరు మోచేతులను తాకించుకుంటూ అభివాదాలు తెలుపుకొన్నారు. బోరిస్ జాన్సన్ ప్రారంభోపన్యాసం చేశారు. మహమ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. గత 18 నెలల్లో చేసిన పొరపాట్లును 2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలో చేసిన తప్పుతను పునరావృతం చేయొద్దని హితవు పలికారు. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వర్చువల్ విధానంలో సదస్సులో పాల్గొననున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా జి-7 సదస్సులో ప్రసంగించనున్నారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్ కూటమి ద్వారా ఈ టీకాలను 92 అల్పాదాయ దేశాలు, ఆఫ్రికా కూటమికి చేరవేయనున్నారు. తమ వంతుగా మూడు కోట్ల డోసులను ఈ ఏడాది చివర్లోగా అందిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ హామీ ఇచ్చారు.