ఐజీ నోబెల్ బహుమతి విజేతల్లో భారతీయ పరిశోధకుడు
ప్రజలను నవ్వించి ఆపై ఆలోచింపచేసే ఆవిష్కరణలకు పురస్కారాలు అందించే ఐజీ నోబెల్ బహుమతి-2023 విజేతల్లో భారతీయ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. చనిపోయిన సాలె పురుగులను మెకానికల్ గ్రిప్పింగ్ సాధనాలుగా వాడుకొనే సాంకేతికతపై చైనా, మలేసియా, అమెరికా శాస్త్రవేత్తలతో కలిసి భారత్కు చెందిన అనూప్ రాజప్పన్ పరిశోధన చేశారు. ఈ బృందం చేసిన అధ్యయనానికి హాస్య శాస్త్ర విన్యాసాల జాబితాలో అవార్డు ఇచ్చారు. అనూప్ ఐఐటీ మద్రాసు విద్యార్థి. తర్వాత అమెరికా వెళ్లారు. ఎంఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు.













