యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు… కానీ
చైనా నుంచి యుద్ధం, ఆక్రమణల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తైవాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏడాది మిలిటరీ సర్వీస్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి ఎనాటికైనా ఆక్రమణ తప్పదనే భయాందోళనలో ఉండిరది ఈ చిన్న ద్వీప దేశం. ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ స్వయంగా ఈ ప్రకటన చేయడం విశేషం. తైవాన్‌పై చైనా బెదిరింపులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ, నా తోటి పౌరులారా శాంతి ఆకాశం నుంచి ఊడిపడదని గుర్తించాలి అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో త్వరగతిన మారుతున్న పరిస్థితుల ఆధారంగా నాలుగు నెలల మిలిటరీ సర్వీస్ సరిపోదు. అందుకే దానిని ఏడాదికి పొడిగించాలని నిర్ణయించాం. 2024 నుంచి ఏడాది మిలిటరీ సర్వీస్ తప్పనిసరి కానుంది. 2005 నుంచి జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వాళ్లందరికీ కొత్త కొనసాగింపు వర్తిస్తుందని ప్రకటించింది.













