రష్యా సైన్యం కీలక ప్రకటన.. ఖేర్సన్ నుంచి
దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఖేర్సన్, దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలగుతున్నట్లు రష్యా సైన్యం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాంతాలకు సరఫరాలు చేరవేయడం అసాధ్యమని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగుకు ఉక్రెయిన్లోని రష్యా సైనిక కమాండర్`జనరల్ సెర్గే సురోవికిన్ నివేదించిన దరిమిలా ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనికి షోయిగు అంగీకరించి, బలగాలు ద్నీపర్ నదికి తూర్పు తీరాన మోహరించేందుకు ఆమోదం తెలిపారు. యుద్దం మొదలైన ఎనిమిది నెలల తర్వాత ఇలా వైదొలగాల్సి రావడం పుతిన్ సైన్యానికి కొంత ఇబ్బందికర పరిస్థితే. దీనికి ఉక్రెయిన్ వర్గాలు వెంటనే ధ్రువీకరించలేదు. ఖేర్సన్ విషయంలో రష్యా ఇలాంటి ప్రకటన చేసి ప్రజలు రష్యా నియంత్రణలోని భూభాగాల్లోకి వెళ్లేలా పన్నాగం పన్నేలా ఉందని ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ అనుమానం వ్యక్తం చేశారు.













