ఉక్రెయిన్ లో విస్తరిస్తున్న యుద్ధం
ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌పై రష్యా సేనలు క్లస్టర్ బాంబులు ప్రయోగించాయి. ఈ ధాటికి పలువురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. పారిశ్రామికంగా సంపన్నమైన డాన్‌బాస్‌ను చేజిక్కించుకునేందుకు నెలల తరబడి ప్రయత్నిస్తున్న మాస్కో బలగాలు ఇతర ప్రాంతాలనూ స్వాధీనం చేసుకోదలిచినట్టు ప్రకటించాయి. ఇందులోనే భాగంగానే 14 లక్షల జనాభా ఉన్న ఖర్కివ్‌తో పాటు మైకోలాయిన్, క్రామటోర్స్ కు, కోస్టియన్ టైనివ్కా పట్టణాలపైనా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. డాన్‌బాస్‌తో పాటు ఖర్సేన్ జాపోరిరిaయా ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక సైనిక చర్యలు చేపట్టినట్టు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు.













