అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకున్నాం : సునాక్
దేశంలోకి ఆశ్రయం పొందేందుకు వచ్చే వారి దరఖాస్తులను 2023 చివరి కల్లా పూర్తిగా పరిష్కరించాలన్న లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. చిన్న చిన్న పడవల ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిని 36 శాతం మేర అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో యూరప్‌లోకి వలసదారుల తాకిడి గణనీయంగా ఉందని వివరించారు. శరణార్థుల దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా మిలియన్ల కొద్దీ ప్రజాధనం ఆదా అవుతోందని తెలిపారు. అక్రమ వలసల భారం నుంచి బ్రిటిష్ ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 2022 చివరి నాటికి 92 వేల శరణార్థుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా అంతకు మించి 2023లో 1,12,000 దరఖాస్తులను పరిష్కరించినట్లు దేశ హోం శాఖ తెలిపింది. 2022 తర్వాత ఇదే అత్యధికమని వివరించింది.













