ఎవరు గెలిచిని వారితో కలిసి పనిచేయడానికి సిద్ధం: పుతిన్
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ రెండోసారి గెలుపొందాలని రష్యా ఆకాంక్షించింది. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ఆయన మేలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎవరు గెలిచినా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ మాస్కో కోణంలో చూస్తే మాత్రం బైడెన్ గెలవాలని తాను కోరుకుంటానన్నారు. బైడెన్ అనుభవం, అంచనావేయగల నేత అని పుతిన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ తాను వైద్యుణ్ని కాదని, ఆ విషయాలపై వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ ఇలాంటి విమర్శలు తీవ్రరూపం దాలుస్తున్నాయన్నారు. 2011లో నేను బైడెన్‌ను స్విట్జర్లాండ్‌లో కలిసిపనప్పుడు కూడా ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, అప్పటికి ఆయన సాధారణంగానే ఉన్నారు. అయితే, పేపర్లో చూస్తూ మాట్లాడతారు. తానూ చాలా సందర్భాల్లో అలా చేస్తాను. అది పెద్ద విషయమేమీ కాదు అని అన్నారు.













