ఆయనపై పెట్టిన కేసులు రాజకీయ ప్రేరేపితం : పుతిన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతు పలికారు. ఆయనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. రష్యా, ట్రంప్ మధ్య స్నేహపూరిత వాతావరణం కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజా వ్యాఖ్యలు వినిపించాయి. డొనాల్డ్ ట్రంప్‌ని వేధిస్తున్న తీరు ఆ దేశ వ్యవస్థల పతనానికి నిదర్శనం. తన పోటీదారుపై రాజకీయ ప్రేరేపితమైన వేధింపులు జరుగుతున్నాయి అని బైడెన్ ప్రభుత్వంపై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు అంశాల్లో అమెరికా, రష్యా మధ్య సత్సంబంధాలు లేవు. ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య ప్రారంభించిన దగ్గరి నుంచి అవి మరింత దిగజారాయి. అమెరికాకు వచ్చే ఏడాది ఎవరు అధ్యక్షుడైనా రష్యా పట్ల ఆ దేశ విదేశాంగ విధానంలో మార్పు ఉంటుందనుకోవడం లేదని పుతిన్ అన్నారు.













