ఆఫ్ఘన్, తాలిబన్ల ప్రతినిధులతో పాంపియో భేటీ
ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ, తాలిబన్ల ప్రభుత్వ ప్రతినిధులతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భేటీ అయ్యారు. కతార్ రాజధాని దోహాలో ఆఫ్ఘన్ ప్రభుత్వం-తాలిబన్ల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల పురోగతి తెలుసుకోవడం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ పక్రియను వేగవంతం చేయడం నేపథ్యంలో పాంపియో భేటీ జరిగింది. దోహాలోని ఒక లగ్జరీ హోటల్లో ఆఫ్ఘన్ ప్రభుత్వ, తాలిబన్ల ప్రతినిధులతో పాంపియో వేరువేరుగా సమావేశమయ్యారు. అలాగే కతర్ పాలకుడు ఎమిర్ షైక్ తమిన్ బిన్ హమద్ అల్ తని, విదేశాంగ మంత్రి మహమ్మద్ బిన్‌తో పాంపియో సమావేశమయ్యారు. పాంపియో ప్రస్తుతం యూరప్-మధ్య ప్రాచ్యాల్లోని ఏడు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.













