బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనబోవడం లేదన్న వార్తలు వట్టి వదంతులని దక్షిణాఫ్రికా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి నాలెడి పాండొర్ పేర్కొన్నారు. 22వ తేదీన జరిగే సమావేశానికి మోదీ వ్యక్తిగతంగా హాజరవుతారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వర్చువల్‌గా హాజరవుతారని వెల్లడించారు. పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారంట్ జారీ చేసినందున ఆయన వస్తే దక్షిణాఫ్రికా ప్రభుత్వం అరెస్టు చేయాల్సి వస్తుంది. అందువల్ల పుతిన్ వర్చువల్‌గానే హాజరవుతారు.













