గణతంత్ర వేడుకలకు అతిథిగా జో బైడెన్
జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఢిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో ఈ విషయమై జో బైడెన్‌తో మోదీ మాట్లాడారని మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సు కూడా అదే సమయంలో భారత్‌లో జరుగుతుందా అని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని గార్సెట్టి బదులిచ్చారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్యాడ్ సదస్సుకు వచ్చే ఏడాది మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ నేతలను ముఖ్య అతిథులుగా మన దేశం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.













