యుద్ధాన్ని ఆపేలా పుతిన్‌ని మోదీ ఒప్పించగలారా? : అమెరికా
ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగడానికి చాలా సమయం పడుతుందని అమెరికా పేర్కొంది. ఇరు దేశాలు శత్రుత్వానికి ముగింపు పలికేలా పలు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని పిలుపునిచ్చింది. ఆ ప్రయత్నాలన్నింటిని తాను స్వాగతిస్తానని కూడా వెల్లడిరచింది అమెరికా. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ పుతిన్‌కి ఈ యుద్దాన్ని ఆపడానికి ఇంకా కొంత సమయం అవసరమని భావిస్తున్నా. ప్రధాని మోదీ పుతిన్ ఒప్పించి ఈ యుద్దాన్ని ముగించేలా చేయగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ మోదీ యుద్దాన్నే ఆపేలా ఏ ప్రయత్నం చేసినా దాన్ని తాము స్వాగతిస్తామని, ఆయనకు అవకాశం ఇస్తామని అన్నారు.













