మరోసారి భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్ !
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరోసారి భేటీ కానున్నారు. వచ్చే వారం దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సదస్సు ఇందుకు వేదిక కానుంది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు వ్యక్తిగతంగా హాజరు అవుతారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో మోదీ`జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి నెలకొంది. ఇరువురు నేతలు చివరిసారి గతేడాది నవంబర్‌లో బాలి ( ఇండోనేసియా)లో జరిగిన జీ20 సదస్సులో మాట్లాడుకున్నారు. అంతకుముందు ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో మాత్రం ఇద్దరు నేతలు పలకరించుకోకపోవడం గమనార్హం.













