భారత్-చైనా మధ్య నమ్మకం పోయింది.. అందుకే పదేపదే
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ గట్టి కౌంటరిచ్చారు. ఇరు దేశాల మధ్య నమ్మకం పోయింది. సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఉద్ఘాటించారు. బ్రిక్ దేశాల సమావేశం నిమిత్తం దక్షిణాఫ్రికాలోని జొహెన్నస్బర్గ్లో ఉన్న డోభాల్ చైనా దౌత్యవేత్త (ప్రస్తుతం విదేశాంగ మంత్రి) వాంగ్ యీతో సమావేశమయ్యారు. డోభాల్తో భేటీ సందర్భంగా వాంగ్ యీ మాట్లాడుతూ పరస్పరం వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంచుకుంటూ, సహకరించుకోవడంపై ఇరుదేశాల మధ్య కృషి జరగాలని, తద్వారా సంబంధాలను పూర్వస్థితికి తీసుకురావాలని ఆకాంక్షించారు. చైనా ఎన్నటికీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించబోదు అని వ్యాఖ్యానించారు.













