దాని వల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదు… అమెరికా
అమెరికా యుద్ధ ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకోవడంపై అమెరికా స్పందించింది. దానివల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చేసింది. భారత్‌పై ఆంక్షలు విధించే ఆలోచన తమకు లేదని పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి ఎవరూ చమురు కొనరాదని హెచ్చరిస్తున్న అమెరికా భారత్ విషయంలో మాత్రం మొదటి నుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. విధానపరమైన విభేదాలు ఉన్నప్పటికీ భారత్‌తో సంబంధాలు కలిగి ఉండటం తమకు అత్యంత కీలకమని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి (యూరోపియన్ వ్యవహారాలు) కరెన్ డన్ఫ్రైడ్ స్పష్టం చేశారు.













