డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
పరిమిత మోతాదులో మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయానికి విరుద్ధంగా మద్యం కొద్ది మోతాదులో తీసుకున్నా అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించిన ప్రకటనలో డబ్ల్యూహెచ్ఓ ఈ వివరాలను విస్పష్టంగా వెల్లడిరచింది. మద్యం వినియోగం విషయంలో ఒక గ్లాస్ వైన్ లేదా గ్లాస్ బీరు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండదని పేర్కొంది. మద్యపానం పేగు, బ్రెస్ట్ క్యాన్సర్ సహా ఏడు రకాల క్యాన్సర్లకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.













