అమెరికాలో భారతీయులపై కుట్ర
దంతవైద్యం, దానికి సంబంధించిన వ్యాపారాల్లో అంతరాష్ట్ర స్థాయిలో ఒక భారీ కుట్ర చేశారంటూ తొమ్మిది మంది భారతీయ అమెరికన్లు, భారతీయులు సహా మొత్తం 12 మందిపై పెన్సిల్వేనియాలో కేసు నమోదైంది. సవానీ గ్రూప్ కంపెనీలతో ఈ 12 మంది వ్యక్తులు కలిసి వీసా మోసాలు, చికిత్సలకు సంబంధించిన మోసాలు, పన్ను ఎగవేత, నగదు అక్రమ చలామణి వంటివాటికి పాల్పడ్డారని కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. వారిలో ఆరుగురు సవానీ గ్రూపులో పనిచేస్తున్నారు. ఈ గ్రూప్‌నకు చెందిన భాస్కర్ సవానీ (57), నిరంజన్ సవానీ (51) ఇద్దరూ పెన్సిల్వేనియాలో లైసెన్సు ఉన్న దంతవైద్యులు. అరుణ్ సవానీ ( 55) ఈ గ్రూపు ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటారు. ఈ సోదరులు ముగ్గురూ విదేవీయులకు అమెరికా వీసాలు ఇప్పిస్తూ, అదే సమయంలో వారి అసలు ఉద్యోగాలు, బాధ్యతలను దాచిపెట్టారు. ఈ నెల 20న వీరు ముగ్గరూ కోర్టుకు హాజరయ్యారు.













