డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్.. సీరియస్ గా తీసుకోవాలి
ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ కొత్త సవాల్ విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడిరచారు. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వాలు వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని తెలిపింది.













