మాకు యూఎస్ మద్దతు కావాలి : మలాలా
అఫ్గాన్ బాలికలకు, మహిళలకు బలమైన యూఎస్ మద్దతు కావాలని నోబ్‌ల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల న్యాయవాది మలాలా యూసఫ్ జాయ్ తెలిపారు. వాష్టింగన్ పర్యటన సందర్భంగా యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలకు సెకండరీ విద్య అందుబాటులో లేని ఏకైక దేశం అఫ్గనిస్తాన్ అని అన్నారు. బాలికలందరికీ సురక్షితమైన మరియు నాణ్యమైన విద్యను పొందగలిగే ప్రపంచాన్ని మేము చూడాలనుకుంటున్నాం అని రాసిన లేఖను బ్లింకెన్కి అందజేశారు. అంతేకాదు తమను ఎంతకాలం పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు దూరం చేస్తారో అంతలా తమ భవిష్యత్తుపై ఆశ చిగురిస్తూనే ఉంటుందని లేఖలో ప్రస్తావించిన విషయాన్ని మలాలా పేర్కొన్నారు. దేశంలో శాంతి భద్రతలను తీసుకురాగలిగే అతి ముఖ్యమైన సాధనం బాలికల విద్య అని, అమ్మాయిలు చదువుకోకపోతే అఫ్గాన్ నష్టపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.













