ఉత్తర కొరియి అధినేత కిమ్ కంటతడి!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పేరు వినగానే ఆయన నియంతృత్వ వైఖరే గుర్తొస్తుంది. కఠిన ఆంక్షలతో ప్రజలను వణికిస్తున్న ఈ నియంత కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తర కొరియాలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తుండటంతో ఇటీవల దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో అధ్యక్షుడు కిమ్ మాట్లాడుతూ జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత. ఇందుకోసం మా ప్రభుత్వం తల్లులతో కలిసి పనిచేయాలని కోరుకుంటోంది అని తెలిపారు. దేశంలోని తల్లులంతా మరింత ఎక్కువమంది పిల్లల్ని కనాలని చెబుతూ కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలోని మహిళలు కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.













