ఈ విజయోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తాం : జెలెన్స్కీ
ఖెర్సన్ నుంచి రష్యా వైదొలగడాన్ని ఉక్రెయిన్ పండుగ చేసుకుంటోంది. ఆ ప్రాంత వాసులంతా తమ సైనికులను హర్షాతిరేకాల నడుమ స్వాగతిస్తూ వారిని ఆలింగనం చేసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటున్నారు. ఖెర్సన్లో నగరమంతా కలియదిరుగుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ విజయోత్సాహాన్ని ఇలాగే కొనాసాగిస్తామని ఉక్రెయన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. రష్యా సేనలను దేశమంతటి నుంచే తరిమేసి తీరతాం. అనేక ప్రాంతాల్లో మా సేనలకు సొంత పౌరుల నుంచి త్వరలో ఇలాంటి మరెన్నో స్వాగతాలు లభించనున్నాయి అన్నారు.













