రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటే.. ఈ శతాబ్దం ఆసియాదే
భారత్, చైనాల మధ్య సంబంధాలు అత్యంత క్లిష్ట దశలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. అయితే వీటి మధ్య విభేదాల కన్న ఉమ్మడి ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని స్పష్టం చేశారు. రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటే ఈ శతాబ్దం ఆసియాదే అవుతుందన్నారు. బ్యాంకాక్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనిక మోహరింపుతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించాల్సిన బాధ్యత బీజింగ్ నాయకత్వంపైనే ఉందన్నారు. 16 దఫాలు సైనిక కమాండర్ల మధ్య చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు వాస్తవాధీన రేఖ వెంట శాంతి నెలకొనడమే ముఖ్యమంత్రి భారత్ పదేపదే స్పష్టం చేస్తోందన్నారు.













