సౌదీ తెలుగు తేజానికి ఘన సన్మానం
ప్రతిష్ఠాత్మకమైన సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన మహాద్ షాను కేంద్ర ప్రభుత్వం తరపున రియాద్‌లోని భారతీయ ఎంబసీ ఘనంగా సన్మానించింది. 17 ఏళ్ల మహాద్ షా బ్యాడ్మింటన్ పోటీలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు రూ.2.18 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. కేరళకు చెందిన ఖదీజా అనే బాలిక కూడా ఇదే తరహా విజయాన్ని సాధించింది. ఈ ఇద్దరు విజేతలను తాత్కాలిక రాయబారి ఎన్.రాంప్రసాద్ ఎంబసీలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలు బహుకరించారు. కార్యక్రమంలో భారతీయ అధికారులు, ఇద్దరు విజేతల కుటుంబ సభ్యులు, పాఠశాల ప్రిన్సిపాల్ గ్రే థామస్, ప్రముఖ సామాజిక సేవకులు ముజమ్మీల్ శేఖ్, షిహాబ్ కొత్తుకాడ్, తెలుగు ప్రవాసీ ప్రముఖులు దుగ్గపు ఎర్రన్న, ఉషాశ్రీ, కోచ్‌లు పాల్గొన్నారు.













