భారత్ వాస్తవాలను వెల్లడించటం లేదు…

కరోనా మృతుల సంఖ్యలో భారత్ వాస్తవాలను వెల్లడించటం లేదని, చాలా తక్కువ చేసి చెబుతున్నదని వాల్‍స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. భారత్ థోరణి కారణంగా ప్రపంచంలో కరోనాపై పోరాటంలో సృష్టత కొరవడుతున్నదని ఈ కథనంలో నిపుణులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 3.9 లక్షల మంది మరణించారని, భారత్ ప్రకటించింది. కానీ, ఈ సంఖ్య చాలా తక్కువని, భారత్‍లో కనీసం 11 లక్షల మంది కరోనా వల్ల మరణించిన ఉంటారని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ఇన్‍స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ విభాగం పేర్కొన్నట్లు వెల్లడించింది.వాస్తవాలను తెలియజేయకపోవడం వల్ల కొవిడ్ -19 డెల్టా వేరియంట్ వల్ల కలిగే నష్టాన్ని, ప్రమాదాన్ని అంచనా వేయటం కష్టమవుతున్నదని పేర్కొన్నది.