అనవసర ప్రయాణాలొద్దు : భారత్
కీన్ సహా పలు ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణుల భీకర దాడుల నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులకు రాయబార కార్యాలయం ప్రత్యేక హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్ ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీచేసిన భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. ఉక్రెయిన్లోని భారతీయులు తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయానికి తెలియజేయాలని సూచించింది. అనివార్యమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని తెలిపింది. రష్యా`క్రిమియా మధ్య వంతెన పేల్చివేత ఘటనతో మరోసారి ఉద్రికత్తలు తీవ్ర రూపం దాల్చాయి. మిస్సైళ్లతో రష్యా భీకరదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో కీవ్లోని భారత రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు జారీ చేసింది.













