యూఎన్ లో రష్యా తీర్మానం.. భారత్ గైర్హాజరు
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన మరో తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. అమెరికాలో కలిసి ఉక్రెయిన్ జీవాయుధాలు తయారు చేస్తోందటూ భద్రతా మండలిలో రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. రెండు దేశాలు చేపడుతున్న మిలటరీ బయోలాజికల్ కార్యకలాపాలపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. దీనికి రష్యా, చైనా మాత్రమే అనుకూలంగా ఓటేశాయి. మండలి 5 శాశ్వత సభ్య దేశాల్లోని మిగతా మూడు,..అమెరికా, ఫ్రాన్స్, యూకే వ్యతిరేకించాయి. భారత్ సహా భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలన్నీ కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు.













