వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రత్యేక అతిథులు భారతీయ అమెరికన్ పిల్లలు
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో నిర్వహించిన దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ అమెరికన్లను అధ్యక్షుడు జో బైడన్ స్వయంగా ఆహ్వానించారు. దీని ద్వారా డిఫర్డ్ యాక్షన్ లీగల్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏఎల్‌సీఏ) పిల్లలకు సంఫీుభావం తెలుపుతున్న సందేశాన్ని ఆయన అందించారని భావిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లి, అక్కడ నివసించడానికి తగిన పత్రాలు లేని పిల్లలు డీఏసీఎల్‌ఏలో ఉన్నారు. వీరిని ఎప్పుడైనా అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. డీఏఎల్‌సీఏ పిల్లల తరపున పోరాడుతున్న ఇంఫ్రూవ్ ద డ్రీమ్ సంస్థ వ్యవస్థాపకుడు దీప్ పటేల్‌తో పాటు పరీన్ మహత్రే, అతుల్య రాజ్‌కుమార్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నడంపై సంతోషం వ్యక్తం చేశారు.













