ట్విట్టర్ సిఇఓకు ఎలాన్ మాస్క్ వార్నింగ్!
44 బిలియన్ డాలర్లు పైబడిన ట్విట్టర్-మస్క్ డీల్ రద్దు పై డ్రామా కొనసాగుతోంది. ఒప్పందం రద్దు చేసుకోవడానికి ముందు ట్విట్టర్ సీఇఓ పరాగ్ అగర్వాల్‌కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వార్నింగ్ ఇచ్చారని లాయర్లు కోర్టుకు వెల్లడించారు. ట్విట్టర్ యూజర్లలో నకిలీ లేదా స్పామ్ అకౌంట్లు 5 శాతం కంటే తక్కువున్నాయనే సమచారం అడగడంతో నన్ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఆటంకాలు సృష్టించడంపై మీ లాయర్లు చర్చిస్తున్నారు. వాటిని ఆపేయండి అన్ని హెచ్చరిస్తూ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ సీఎఫ్‌వో నెడ్ సెగల్కి ఎలాన్ మస్క్ సందేశం పంపించారని లాయర్లు వివరించారు. ట్విట్టర్ డీల్ రద్దు చేసుకోడానికి ముందే మస్క్ ఈ హెచ్చరికలు పంపారని పిటిషన్లో పేర్కొన్నారు. ట్విటర్ ల్ పూర్తి చేసుకోడానికి నిధులు ఏవిధంగా సమకూర్చుకోబోతున్నాని కోరగా ఆయన నుంచి ఈ విధమైన రిప్లై వచ్చిందని వివరించారు.













