డిస్నీల్యాండ్ ఓపెన్… కానీ తొలుత వారికి మాత్రమే అనుమతి
కాలిఫోర్నియాలో కరోనా లాక్‌డౌన్‌తో మూత పడ్డ డిస్నీల్యాండ్, ఇతర థీమ్ పార్క్‌లతో పాటు స్టేడియం, అవుట్డోర్ ఎంటర్టైన్మెంట్ వేదికలను ఏప్రిల్ 1 నుండి తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఏడాది క్రితం ఇవన్నీ మూతపడ్డాయి. అయితే ఎంజాయ్ చేశాద్దామనుకుంటే మాత్రం చెల్లదు. తిరిగి ఇవి తెరుచుకున్నప్పటికీ కొన్ని కొవిడ్ హెచ్చరికల మధ్య ఇవి పనిచేయనున్నాయి. ధీమ్, అమ్యూజ్మెంట్ పార్క్‌లను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు. కొవిడ్ 19 నిబంధనలను అనుగుణంగా వీటిని నడపనున్నారు. మాస్క్‌లు, ఇతర భద్రతా చర్యలు తప్పనిసరి. తొలుత కాలిఫోర్నియా వాసులకు మాత్రమే వీటిలోకి పర్యటించేందుకు అనుమతినిచ్చారు. అందులోనూ 15 శాతం నుండి 30 శాతం మందికి మాత్రమే ఉంటుంది. ఇతరులకు అప్పుడే అనుమతి లేదు. అవుట్ డోర్ స్టేడియం, బాల్ పార్క్‌ల్లో ప్రత్యక్షంగా క్రీడలు వీక్షించేందుకు అనుమతినిచ్చారు. అయితే అది కూడా పరిమిత సంఖ్యలోనే.













